హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్‌తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ‘స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం ఇన్ ఇండియా’ పేరుతో నీతి ఆయో గ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో 24 వేలకు పై గా సర్కార్ బడులుండగా, 20 శాతం స్కూళ్లను సింగి ల్ టీచర్లతో నెట్టుకొస్తున్న తీరు ప్రభుత్వ విద్య దుస్థితి ని కండ్లకు కడుతున్నది. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పదో స్థానంలో ఉన్నది. తమిళనాడు, గుజరాత్, బీహార్‌తో పోల్చితే తెలంగాణలోనే అత్యధికంగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి.
ప్రాథమిక విద్య ఉన్నత చదువులకు పునాదిగా భావిస్తున్న ఈ రోజుల్లో 5 వేల స్కూళ్లు సింగిల్ టీచర్లతో నడుస్తుండటం ఆందోళనకరం. ఈ బడుల్లో ఒకటి నుంచి ఐదు తరగతులుండ గా ఒకటి, రెండు తరగతుల్లో మూడు సబ్జెక్టులు, మూ డు నుంచి ఐదు తరగతులకు నాలుగు సబ్జెక్టుల చొ ప్పున ఉంటా యి. రోజుకు బోధించాల్సిన మొత్తం సబ్జెక్టులు 18. విద్యార్థులెందరున్నా అన్ని తరగతులకు పాఠాలు చె ప్పాల్సిందే. అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పూర్తి చేయాల్సిందే. ఒక్క టీచరే మొత్తం తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధించలేకపోతున్నారు. ఈ పరిస్థితులతో రాష్ట్రంలోని విద్యార్థులు న్యాస్ సర్వేలో వెనుకబడుతున్నారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లల్లో సెకండ్..
సర్కార్ బడుల్లో పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య సైతం ఏటేటా తగ్గిపోతున్న ది. దేశవ్యాప్తంగా 7,993 జీరో ఎన్రోల్మెంట్ స్కూ ళ్లు ఉన్నాయి. అంటే విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈ విషయంలో 3,812 స్కూళ్లతో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ 2,245 జీరో ఎన్రోల్ మెంట్ స్కూళ్లతో రెండోస్థానంలో ఉన్నది. ఈ స్కూళ్లల్లో 1,016 మంది టీచర్లు పని చేస్తున్నారు. రాష్ర్టాల వారీగా తీసుకుంటే కర్ణాటకలో 270, మధ్యప్రదేశ్ 463, తమిళనాడు 311, రాజస్థాన్‌లో 215 చొప్పున జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఉన్నాయి.
మొక్కు‘బడి’ చదువులే!
దేశవ్యాప్తంగా సర్కార్ బడుల పరిస్థితి దిగజారుతున్నది. వేల ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా తదితర సౌకర్యాలు క రువయ్యాయి. నీతి ఆయోగ్ ని వేదిక ప్రకారం దేశంలో లక్షకు పైగా పాఠశాలల్లో కేవలం ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారు. కొన్ని రాష్ర్టాల్లో విద్యార్థిఉపాధ్యాయ నిష్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉపాధ్యాయుల నైపుణ్యం తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. గత పదేండ్లలో కరెం ట్ సౌకర్యం 55 శాతం నుంచి 91.9 శాతానికి పెరిగినా, ఇంకా 1.19 లక్షల పాఠశాలల్లో కరెంట్ సదుపాయం లేదు. 98,592 స్కూళ్లలో బాలికలకు ఉపయోగపడే మరుగుదొడ్లు లేవని నివేదిక తెలిపింది. 61,540 పాఠశాలల్లో ఉపయోగించగల మరుగుదొడ్లు ఏవీ లేవు.
ఉపాధ్యాయుల నైపుణ్యమే ప్రధాన సమస్య
దేశంలో 1,04,125 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని నివేదిక పేర్కొంది. జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలల్లో విద్యార్థిఉపాధ్యాయ నిష్పత్తి 47:1గా ఉంది. అలాగే ప్రభుత్వ సెకండరీ పాఠశాలల్లో కేవలం 51.7 % పాఠశాలల్లో మాత్రమే సైన్స్ ప్రయోగశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయుల సామర్థ్యం కూడా ఆందోళనకరంగా ఉంది. గణిత పరీక్షల్లో కేవలం 2% మంది మాత్రమే 70%కు పైగా స్కోర్ చేయగా, సగటు మార్కులు 46% మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా సెకండరీ పాఠశాలల డ్రాపౌట్ రేట్ 11.5% ఉంది. పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, అస్సాం రాష్ర్టాల్లో ఈ రేటు జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువ గా ఉంది. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రా ష్ర్టాల్లో డ్రాపౌట్ శాతం గణనీయంగా పెరిగింది. భారత్ తన జీడీపీలో కేవ లం 4.6% మాత్రమే విద్యపై ఖర్చు చేస్తున్నది. ఇది ఇతర దేశాలతో పో లిస్తే తక్కువ. యూఎస్, యూకే 5.9%, జర్మనీ, ఫ్రాన్స్ 5.4% చొ ప్పున విద్యపై ఖర్చు చేస్తున్నాయి.