మల్యాల, ఏప్రిల్ 11 : ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక నాయకులతో కలిసి గురువారం ఆయన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. తద్వారా పలువురు రైతులు ప్రైవేట్ డీలర్లను, నేరుగా రైస్‌మిల్లులకు అమ్ముకొని నష్టపోతున్నారని తెలిపారు. బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం మద్దతు ధరనైనా రైతులకు దక్కేలా కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు.