SCR | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైళ్ల సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు, విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
జులై 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేస్తున్న రైలు సర్వీసుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 50కి పైగా రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా, ఎనిమిది రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే మరో ఐదు రైళ్ల సమయాల్లో తాత్కాలికంగా రీ షెడ్యూల్ చేసింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సర్వీసులందించే 22 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులనూ రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.