బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించాలి
మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రౌండ్లో మంగళవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
- 33% మహిళా రిజర్వేషన్లలో 16.5% బీసీ మహిళలకు ఇవ్వాలి : శ్రీనివాస్‌గౌడ్
- కాచిగూడలో బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రౌండ్లో మంగళవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వీ హనుమంత రావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లులోని 33% కోటాలో 50% బీసీ మహిళలకు, అంటే మొత్తం సీట్లలో సుమారు 16.5% సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. సబ్ కోటా అమలు చేయకపోతే అగ్రవర్ణ మహిళలు మాత్రమే లాభపడి, బీసీ మహిళలు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నదని వాపోయారు. తెలంగాణలో బీసీలు జనాభాలో సుమారు 50-52% ఉన్నా చట్టసభల్లో బీసీ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైనప్పుడు బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కాలంటే సబ్ కోటా తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని, జనగణనలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాల మాదిరిగానే బీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కుల్కచర్ల శ్రీనివాస్, కురుమ శ్యామ్, విక్రమ్ గౌడ్, మహేశ్ యాదవ్, గణేశాచారి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

