హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తేతెలంగాణ): బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 50శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, విజయరాఘవన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యాలయంలో కార్యదర్శి జాన్‌వెస్లీతో వారు మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చిన అదే బీజేపీ కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీసీల పట్ల రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.