హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ( Municipal Elections ) నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు ( Mayors ) , మున్సిపల్ చైర్పర్సన్ల( Chairpersons ) కు రిజర్వేషన్లు ( Municipal Reseervations 2026 ) ఖరారయ్యాయి. ఈ మేరకు మునిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం ఖరాయిన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వీటిలో 50 శాతం కార్పొరేషన్లను మహిళలకు రిజర్వేషన్ చేసినట్లు వెల్లడించారు.
మొదట ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేశామని , లాటరీ ద్వారా 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. రాష్ట్రంలోని పది కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఒకటి చొప్పున, బీసీ మహిళలకు మూడు మేయర్ పోస్టులకు రిజర్వేషన్ కల్పించామన్నారు. మరో 5 జనరల్‌కు కేటాయించామని చెప్పారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ( ఎస్టీ జనరల్) రామగుండం కార్పొరేషన్ ( ఎస్సీ జనరల్ ) , మహబూబ్ నగర్ కార్పొరేషన్ (బీసీ మహిళ ), మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్ ( బీసీ జనరల్) వరంగల్ కార్పొరేషన్ ( జనరల్ ), ఖమ్మం, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ( మహిళా జనరల్ ) కు కేటాయించామని వివరించారు. వరంగల్ కార్పొరేషన్‌ను అన్ రిజర్వుడ్‌గా ఉంచారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలల్లో చైర్మన్లుగా ఎస్టీలకు 5, ఎస్సీలకు 15, బీసీలకు 38(31.4%), బీసీ మహిళలకు 19 రిజర్వేషన్లు ఖరాయయ్యని వివరించారు. మిగతా చోట్ల జనరల్‌కు కేటాయించామని వివరించారు.
కార్పొరేషన్లకు రిజర్వేషన్లు
1. జీహెచ్ఎంసీ – మహిళ ( జనరల్ )
2. నల్లగొండ – మహిళ ( జనరల్ )
3. మహబూబ్‌నగర్ – మహిళ (బీసీ)
4. జీడబ్ల్యూఎంసీ – అన్ రిజర్వ్డ్
5. కరీంనగర్ – బీసీ ( జనరల్ )
6. ఖమ్మం – మహిళ ( జనరల్ )
7. నిజామాబాద్ – మహిళ ( జనరల్ )
8. మంచిర్యాల – బీసీ ( జనరల్ )
9. కొత్తగూడెం – ఎస్టీ ( జనరల్ )
10. రామగుండం – ఎస్సీ ( జనరల్ )
రాష్ట్రంలో మునిసిపాలిటీలు, కార్పోరేషన్లకు రిజర్వేషన్లు ఇలా..