Ganja Seized | ఆంధ్రా, ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఓ తరలిస్తున్న ఓ వ్యక్తి ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన తిప్పర్తి ముకేశ్ అనే యువకుడు తన కారులో ఏఓబీ నుంచి 57 కిలో గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తూ ఎస్టీఎఫ్కు చిక్కాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తున్న ఎస్టీఎఫ్ బృందం డీఎస్పీ తిరుపతి యాదవ్ ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన యువకుడు ఏఓబీ నుంచి గంజాయిని హైదారాబాద్‌కు తీసుకు వస్తున్నాడనే సమాచారం మేరకు.. డీఎస్పీ తిరుపతి యాదవ్ ఎస్టీఎఫ్ బృందం కారులో వెళ్లి మంగళవారం తెల్లవారు జామున భద్రాచలం టౌన్ చెక్‌పోస్ట్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టింది.
ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నది. కారులో ఉన్న గంజాయిని తూకం వేయగా 57కిలోల వరకు ఉన్నట్లు తేలింది. ఈ గంజాయి విలువ రూ.50లక్షల మేర ఉంటుందని డీఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న బృందంలో ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేశ్, ఎస్ఐతోపాటు సిబ్బంది ఉన్నారు. పట్టుకున్న గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహిమ్ ఉన్నీసాకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీఎస్పీతోపాటు సిబ్బంది ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఎన్ఫోర్స్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.