హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/డిండి: చెరువుల పండుగకు హాజరై, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై మృతిచెందిన నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరినెమలిపూర్కు చెందిన వడ్త్యా పాండునాయక్ కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
పాండునాయక్ మృతిపట్ల విచారం వ్యక్తంచేసిన సీఎం.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శుక్రవారం దేవరకొండ దవాఖానలో బాధిత కుటుంబాన్ని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ పరామర్శించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.