బాన్సువాడ, జూలై 13: సిజేరియన్ వికటించడంతో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురైన ఘట న కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. శుక్ర, శనివారాల్లో బాన్సువాడ మాతాశిశు దవాఖానకు వచ్చిన పది మంది గర్భిణులకు వైద్యులు సిజేరియన్ చేశారు. అందులో ఐదుగురికి సిజేరియన్ వికటించింది. 10న ఎల్లారెడ్డికి చెందిన ఉమేర ఫాతిమా, బాన్సువాడకు చెందిన లక్ష్మిప్రియకు సిజేరియన్ చేయగా అదేరోజు రాత్రి అధిక రక్తపోటు, శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో వారిని నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఈ నెల 11న పిట్లం మండలం బండపల్లికి చెందిన సునీత, గాంధారికి చెందిన జ్యోతి, బాన్సువాడ మండలం కొత్తాబాదికి చెందిన రుక్సానాకు సిజేరియన్ చేయగా, ప్లేట్లెట్స్ పడిపోవడం, తీవ్ర రక్తస్రావం, యూరిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో సిబ్బంది నిజామాబాద్ దవాఖానకు తరలించారు. ఉమేరా ఫాతిమా, జ్యోతి, రుక్సానా పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు.