హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): బీటెక్ కోర్సుల్లో తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 5,039 సీట్లు భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. ఎప్‌సెట్ తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో 93, యూనివర్సిటీల్లో 1,056, ప్రైవేట్ వర్సిటీల్లో 19, ప్రైవేట్ కాలేజీలో 3,871 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్‌కు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 11లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. వివరాలకు http :// bse. telangana. gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్షీట్ల విడుదలలో తాత్సారమెందుకని..? డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పరీక్షలు ముగిసి వారంరోజులు గడిచినా ఇంతవరకు ప్రాథమిక కీ విడుదల చేయకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి తార్కాణమని ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు లోకల్ క్యాడర్ గవర్న్మెంట్ టీచర్స్ అసొసియేషన్ (జీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు వీరాచారి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు. గతంలో ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు అనుకూలంగా వచ్చిన జీవోలను కోర్టులు తిరస్కరించాయని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ టీచర్లను జిల్లా పరిషత్ పరిపాలనలోకి పంపించాలని డిమాండ్ చేశారు.