 
                                                            హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 610 ఫైర్‌మెన్‌ల ఉద్యోగాల నోటిఫికేషన్‌కు ఎంపికైన 483 మంది ఫైర్మెన్లు నాలుగు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో శుక్రవారం వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ ట్రైనింగ్ అకాడమీలో వారికి పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు హాజరుకానున్నట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ట్రైనీలకు వరదలు, భూకంపాలు, విపత్తులు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలను సమర్థవంతంగా ఎదురొనేలా శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
 
                            