4,737కొవిడ్ కేర్ సెంటర్లు
- ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 50 వేల పడకలు
- ప్రభుత్వ పరిధిలో 10 వేలు, ప్రైవేటులో 19 వేలు ఖాళీ
- కరోనా రోగుల కోసంప్రభుత్వం అన్నిముందస్తు జాగ్రత్తలు

హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గతేడాది తొలి కేసు నమోదైన సమయంలో చికిత్స, ఔషధాలు, నివారణామార్గాలపై ఏ ఒక్కరికీ అవగాహన లేదు. ఏడాదిపాటు కొనసాగిన తొలివేవ్ ప్రపంచవ్యాప్తంగా అనేక గుణపాఠాలు నేర్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేసుకున్న ఏర్పాట్లు, కల్పించుకున్న మౌలిక సదుపాయాలు సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రం లో గతేడాది పడకల కొరత లేకుండా చేసుకున్న ముందస్తుచర్యలు సెకండ్‌వేవ్ సమయంలో పేషెంట్లకు చికిత్స అందించేందుకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రైవేటు దవాఖానలకు కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతివ్వడంతో 50 వేల పడకలు సిద్ధంగా ఉన్నా యి. దీనికి అదనంగా ఏర్పాటవుతున్న కొవిడ్‌కేర్ సెంటర్లు కరోనా పాజిటివ్స్‌కు ఉపయుక్తంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌సహా అన్నిజిల్లాల్లో కలిపి ప్రభుత్వం 4,737 కొవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో మూడుపూటలా భోజనం, పౌష్టికాహారం అందించడంతోపాటు మందులను సరఫరా చేస్తున్నారు. పదిరోజులపాటు ఇక్కడేఉన్నాక ఇంటికి పంపుతున్నారు. అవసర మైతే పెద్దాసుపత్రులకు పంపుతున్నారు.
పెద్దసంఖ్యలో ఖాళీ పడకలు
ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో మొత్తం 50వేలకుపైగా పడకలు ఉన్నాయి. ఇందులో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభు త్వ దవాఖానల్లో 13,732 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 3,703 పడకలు భర్తీకాగా, 10,029 ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో 30,816 పడకలు ఉండగా 10,919 భర్తీకాగా, 19,897 ఖాళీగా ఉన్నాయి. పడకల సంఖ్యను 60 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్ చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానలు
- గాంధీ దవాఖాన 2. టిమ్స్, గచ్చిబౌలి 3. జిల్లా దవాఖాన, కింగ్ కోఠి 4. ఫీవర్ హాస్పిటల్ 5. చెస్ట్ హాస్పిటల్ 6. ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన (క్వారంటైన్) 7. నేచర్ క్యూ ర్ హాస్పిటల్ (క్వారంటైన్) 8. ప్రభుత్వ హో మియో దవాఖాన (క్వారంటైన్) 9. ప్రభుత్వ నిజామియా దవాఖాన (క్వారంటైన్).
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

