గణపతి నిమజ్జనంలో అపశృతి.. 45 ఏండ్ల వ్యక్తి మృతి
Ganesh Immersion | నల్గొండ జిల్లా చండూర్ మండలం కస్తాల గ్రామంలో గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర గ్రామస్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం

నల్లగొండ : నల్గొండ జిల్లా చండూర్ మండలం కస్తాల గ్రామంలో గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర గ్రామస్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి గ్రామ చెరువులో వినాయకుని నిమజ్జనం చేయబోయారు.
వినాయకుడిని నీళ్ళల్లోకి వదులుతుండగా గ్రామానికి చెందిన గోపిడి రాంరెడ్డి (45) ప్రమాదవశాత్తు వినాయకునితో పాటు నీటిలో పడిపోయాడు. అందరూ చూస్తుండగానే నీట మునిగిన రాంరెడ్డి ఊపిరి ఆడక మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

