Greater Hyderabad Voters | ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 23,22,623 మంది, మహిళలు 22,13,902 మంది ఉన్నారు.
వీరితోపాటు 327 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 883 మంది ఎన్నారైలు, 404 మంది సర్వీస్ ఓటర్లు ఉంటారు. వీరితోపాటు 20, 207 మంది దివ్యాంగ ఓటర్లు, కొత్త ఓటర్లు 77,522 మంది ఉన్నారు. 80 ఏండ్లు దాటిన ఓటర్లు 80,037 మంది ఉన్నారు.