హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 43 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులందరినీ వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత యూనిట్ ఆఫీసర్లను ఆదేశించారు. బదిలీ అయిన అధికారులు రిలీవ్ అయిన వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు.
23మంది ఆర్డీవోలు..
ఇటీవలే 39 మంది ఆర్డీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 23 మందికి స్థానచలనం కల్పించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో 11 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 12 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వీరుకాకుండా మరో 8 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది. వారందరినీ రెవెన్యూశాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.