Pepita Seth : బ్రిటిష్ రచయిత్రి (Britain writer), ఫొటోగ్రాఫర్, సాంస్కృతిక పరిశోధకురాలు, ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత అయిన పెపితా సేథ్ (Pepita Seth) ఇటీవల తన 84వ ఏట భారత పౌరసత్వం (India citizenship) అందుకున్నారు. కేరళలోని త్రిస్సూర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్జున్ పాండ్యన్ (Arjun Pandian) ఆమెకు పౌరసత్వ పత్రాలు అందజేశారు.
దాంతో పెపితా సేథ్ తన జాతీయతను అధికారికంగా త్యజించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఎంతగానో ప్రేమించిన ఈ భూమి నన్ను తన కుమార్తెగా స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెనక్కు వెళ్లాల్సిన పని లేదు’ అన్నారు. కేరళ ఆచారాలు, ఉత్సవాలు, ప్రకృతి సౌందర్యాలను డాక్యుమెంటు చేస్తూ దాదాపు నాలుగు దశాబ్దాలు ఆమె ఇక్కడే గడిపారు.
1857లో బ్రిటిష్ సైనికుడిగా ఉన్న తన తాత రాసిన డైరీ చదివి 27 ఏళ్ల వయసులో పెపితా సేథ్‌ను భారత్‌కు వచ్చారు. ‘గాంధీ’ చిత్రంలో నెహ్రూ పాత్ర పోషించిన నటుడు రోషన్ సేథ్‌ను పెళ్లాడారు. 2012లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.