నిర్మల్: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 4,146 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు ఒక గేటు ఎత్తి 4,473 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయిన నీటిమట్టం 700 అడుగులు. ప్రస్తుతం 697.625 అడుగుల వద్ద నీరు ఉన్నది.