40 శాతం సైబర్‌క్రైం బాధితులే!
- డబ్బు తిరిగి వచ్చిన కేసులు17శాతం మాత్రమే
- 33 శాతం మంది ఈమెయిల్స్‌లో డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు
- లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రోజువారీ జీవితంలో ఆన్లైన్ లావాదేవీలు సర్వసాధారణం అయ్యాయి. ప్రతిచోట ఫోన్‌పే, గూగుల్‌పే, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు.. ఇలా ఏదో ఒకదాన్ని వినియోగిస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఆన్లైన్ లావాదేవీలు, చెల్లింపుల వ్యవహారాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం శాపంగా మారుతున్నది. ఫలితంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైబర్ మోసాలపై విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా గత మూడేండ్లలో తాము లేదా తమ కుటుంబంలో ఒకరు ఆర్థిక మోసానికి గురైనట్లు 42శాతం మంది ప్రజలు అంగీకరించారు.
అంటే సగటున ప్రతి పది మందిలో నలుగురు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినవారే. దేశవ్యాప్తంగా ప్రతినెల 80వేల సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతుండగా.. దాదాపు రూ.200 కోట్ల వరకు నేరగాళ్లు ఆన్లైన్లో కొల్లగొడుతున్నట్టు సర్వే వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్న సొమ్ము రికవరీలోనూ ఆశించినమేర ఫలితాలు ఉండటం లేదు. సైబర్‌క్రైం పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలన్నీ కలిపి మూడేండ్లలో 17శాతం కేసుల్లో మాత్రమే బాధితుల సొమ్మును రికవరీ చేయగలిగారు. అయితే ఆన్లైన్ లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతోపాటు.. బాధితుల స్వయంకృతాపరాధాలే వారిని మోసగాళ్ల చేతికి చిక్కేలా చేస్తున్నాయని లోకల్ సర్కిల్స్ సంస్థ అభిప్రాయపడింది.
వివరాలు చేరుతున్నాయిలా..
- డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సన్నిహిత కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నవారు 29 శాతం మంది.
- కార్యాలయ సిబ్బందికి పిన్ నంబర్లు చెబుతున్న వారు 4శాతం మంది.
- బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్‌కార్డు నంబర్లు, పాస్వర్డ్లు ఈమెయిల్స్‌లో సేవ్ చేస్తున్నవారు 33 శాతం మంది.
- డెబిట్, క్రెడిట్ కార్డుల పాస్వర్డ్లు మొబైల్ ఫోన్ కాంటాక్ట్ నంబర్లలో సేవ్ చేస్తున్న వారు 11 శాతం మంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

