హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల నుంచి రూ.5.7 లక్షల నగదు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్‌లు, ప్రింటర్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారమే.. నకిలీ జీవోలు, ఆర్డర్స్ సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ పేరిట మోసం చేశారు.