HomeTelangana4 45 Crore For Repairs Of Nagireddipalli And Chandragada Lift Schemes
లిఫ్ట్ స్కీమ్‌ల మరమ్మతులకు 4.55 కోట్లు
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నాగిరెడ్డిపల్లి, చంద్రగడ్ లిఫ్ట్ పథకాల మరమ్మతుకు ప్రభుత్వం రూ. 4.45 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.
హైదరాబాద్, ఆగస్టు21(నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నాగిరెడ్డిపల్లి, చంద్రగడ్ లిఫ్ట్ పథకాల మరమ్మతుకు ప్రభుత్వం రూ. 4.45 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ స్కీమ్‌కు రూ. 2.53 కోట్లు, చంద్రగడ్ లిఫ్ట్ స్కీమ్‌కు రూ.1.92 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో ఆ లిఫ్ట్ స్కీమ్‌లకు సంబంధించి మోటర్ల మరమ్మతులు, ప్రెషర్మెయిన్స్, సబ్స్టేషన్ల పునరుద్ధరణ తదితర పనులను నిర్వహించనున్నారు.