గద్వాల: జూరాల జలాశయానికి (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.370 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 7.407 టీఎంసీల నీరు ఉంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో 26 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 4.39 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, 5.83 లక్షల క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. స్పిల్ వే ద్వారా 5.41 లక్షల క్యూసెక్కులు వెళ్తుండగా, పవర్ హౌస్‌కు 33,373 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 312.04 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 303.94 టీఎంసీల నీరు న్నది.