హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.387.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాలలో ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పద్దు కింద రూ.395 కోట్లు జిల్లాలకు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ నిధులు మురిగిపోకుండా చూడాలని కూడా ఉత్తర్వుల్లో సూచించారు. విడుదల చేసిన రూ.387.50 కోట్లలో జనరల్ క్యాటగిరీకి రూ.292.44 కోట్లు, ఎస్సీ ఎస్డీఎఫ్ క్యాటగిరీకి రూ.59.86 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ క్యాటగిరీకి రూ.35.18 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.