హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రీయ విద్యాలయాలను(కేవీ) కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ఖాళీలను భర్తీచేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. దేశవ్యాప్తంగా 1,248 కేంద్రీయ విద్యాలయాల్లో 384 ప్రిన్సిపాల్ పోస్టులు, 81 వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 10వేలకు పైగా పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి. చాలా చోట్ల కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఇటీవలీ కాలంలో మంజూరు చేసిన కేవీల్లో సిబ్బంది లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది.