హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థలైన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న 3,500 మంది జూనియర్ లైన్మెన్లను వెంటనే అసిస్టెంట్ లైన్మెన్లు (ఏఎల్ఎం)గా ప్రమోషన్ కల్పించాలని విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో గురువారం జరిగిన సంఘం 18వ మహాసభలో వారు మాట్లాడారు.
2009 తర్వాత నేరుగా నియమితులైన ఉద్యోగులకు మెరిట్ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 1999-2004 మధ్య చేరిన వారికి పాత పెన్షన్ సీం అమలు చేయాలని కోరారు. ఆర్జిజన్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల నిబంధనలు వర్తింపజేసి జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. సంస్థల్లో 50 శాతం డైరెక్ట్ పోస్టులను బీసీ అధికారులతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 2024-డైరీ, కాలెండర్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవిషరించచారు. కార్యక్రమంలో సంఘం నేతలు రాజేందర్, సదానందం, విజయ కుమార్, రవీందర్, యాదగిరి, చంద్రుడు, అశోక్‌కుమార్, బ్రహ్మేంద్రరావు, నరేందర్, శ్రీనివాస్, సత్యనారాయణ, అశోక్ వెంకటేశ్, కిషోర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.