కార్వాన్, ఆగస్టు 31: బంజారాహిల్స్‌లోని తిబర్మల్ జ్యువెల్లరీ షో రూంలో శ్రీకాంత్ సేల్స్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి రూ.35 లక్షల నగదు తీసుకొని మరో కార్మికుడితో కలిసి అత్తాపూర్‌లోని తన ఇంటికి బయలుదేరాడు.
రేతిబౌలి సమీపంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 28 సమీపంలోని ఓ పాన్ షాపులో కిళ్లీ తీసుకునేందుకు ఆగాడు. ఆ సమయంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చి శ్రీకాంత్ చేతిలోని బ్యాగును లాక్కొని పరారయ్యారు. ఈ విషయమై శ్రీకాంత్ గుడిమల్కాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు.