హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో 34 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఆదివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 7 నుంచి 27 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్-కొట్టాయం, మౌలాలి-కొట్టాయం, కొట్టాయం-సికింద్రాబాద్, కొట్టాయం-కాచిగూడ, మౌలాలి-కొల్లం స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.