జనగామ జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 24 గంటల్లో 31 మందికి ప్రసవాలు చేశారు. అందులో 17 మందికి సాధారణ, 14 మందికి సిజేరియన్ డెలివరీలు చేశారు.
12 మంది మగ, 19 మంది ఆడ శిశువులు జన్మించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని దవాఖాన సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు తెలిపారు. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జనగామ వైద్య బృందానికి ట్విటర్లో అభినందనలు తెలిపారు.