బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 10:20:06

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్‌లు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్‌లు

హైద‌రాబాద్‌: ‌రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో కొత్త‌గా 3018 మంది క‌రోనా వైర‌స్‌బారిన‌ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు 1,11,688కు చేరాయి. మంగ‌ళ‌వారం 1060 మంది బాధితులు డిశ్చార్చి కాగా, ఇప్ప‌టివ‌ర‌కు కరోనా నుంచి కోల‌కున్న‌వారి సంఖ్య 85,223ల‌కు పెరిగాయి. మ‌రో 25,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కొత్త‌గా 10 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 780కు పెరిగింది.  

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్య‌ధికంగా 475 పొజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, మేడ్చ‌ల్ 204, ఆదిలాబాద్ 28, కొత్త‌గూడెం జిల్లా 95, జ‌గిత్యాల 100, జ‌న‌గామ‌ 52, భూపాల‌ప‌ల్లి 20, గ‌ద్వాల జిల్లా 37, కామారెడ్డి 76, క‌రీంన‌గ‌ర్ 127, ఖ‌మ్మం 161, ఆసిఫాబాద్ 11, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 56, మ‌హ‌బూబాబాద్ 60, మంచిర్యాల 103, మెద‌క్ 40, ములుగు 26, నాగ‌ర్‌క‌ర్నూల్ 38, న‌ల్ల‌గొండ 190, నారాయ‌ణ‌పేట 14, నిర్మ‌ల్ 41, నిజామాబాద్ 136, పెద్ద‌ప‌ల్లి 85, రాజ‌న్న‌సిరిసిల్ల 69, రంగారెడ్డి 247, సంగారెడ్డి 61, సిద్దిపేట 88, వికారాబాద్ 21, వ‌న‌ప‌ర్తి 46, వ‌రంగ‌ల్ రూర‌ల్ 61, వ‌రంగ‌ల్ అర్బ‌న్ 139, యాదాద్రి భువ‌న‌గిరి 44 కేసుల చొప్పున ఉన్నాయి. 


logo