పరకాల ; హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలానికి చెందిన
300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. గీసుగొండ, మనుగొండ, ఎలుకుర్తి, గట్టుకిందిపల్లి, రాంపూర్, మచ్చాపూర్, గొర్రెకుంట గ్రామాలకు చెందిన వీరిని ఆదివారం హనుమకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.-