యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి పలువురు దాతలు ముందుకొచ్చి విరాళాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ 30 తులాల బంగారం సమర్పించారు. ఈ మేరకు వినోద్‌కుమార్ సతీమణి బోయినపల్లి మాధవి గురువారం ఆలయంలో ఈవో గీతకు 30 తులాల బంగారం అందజేశారు.
– యాదాద్రి