మణికొండ, ఆగస్టు 20: మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్‌సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు డివిజన్-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా నవీన్‌గౌడ్ పని చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్త బిల్డింగ్‌కు రెండు నీటి కనెక్షన్ల కోసం అధికారులను కలిశాడు. ఇందుకు మేనేజర్ స్ఫూర్తిరెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా ఉపేంద్రనాథ్‌రెడ్డి నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశారు. దరఖాస్తులు సరిగ్గానే ఉన్నా కనెక్షన్లు ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు. డబ్బులు ఇస్తేనే కనెక్షన్లకు అనుమతి ఇస్తామని చెప్పడంతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం స్ఫూర్తిరెడ్డి, నవీన్‌గౌడ్ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి పీఆర్ఎల్ ఎదుట హాజరుపర్చినట్టు తెలిపారు.