Inter Syllabus | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులపై భారాన్ని తగ్గించే దిశగా ఇంటర్‌బోర్డు అడుగులేస్తున్నది. సిలబస్‌ను తగ్గించేందుకు క సరత్తు చేస్తున్నది. ముఖ్యంగా కెమిస్ట్రీ లో 30శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. జువాలజీ సిలబస్‌ను సైతం సవరించాలని యోచిస్తున్నది. ఇంటర్లో ఎస్సీఈఆర్టీ (సీబీఎస్ఈ) సిలబస్ కన్నా.. తెలంగాణ సిలబస్సే అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇంటర్ కెమిస్ట్రీ సిలబస్ వి ద్యార్థులకు భారంగా మారింది.
జేఈ ఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు రాసే వారు అధికంగా కష్టపడా ల్సి వస్తున్నది. విద్యావేత్తలు సైతం ప లుమార్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే 30శాతం సిలబస్‌కు కో తపెట్టనుంది. ఇప్పటికే తగ్గించాల్సిన పాఠ్యాంశాలను బోర్డు షార్ట్‌లిస్టు చేసిం ది. త్వరలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సమావేశమయ్యి మార్పులు ఖరారుచేయనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ప్రవేశపెట్టనుంది. కరోనాపై సైతం పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది.