హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు తగదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాల ఝాన్సీ తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్లో 30శాతం నిధులను కేటాయించాలని కోరా రు. అతి తక్కువ కేటాయింపులతో విద్యారంగం నిర్వీర్యమయ్యే అవకాశముందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడంలేదని విమర్శించారు.