రామాయంపేట, జనవరి 16: గుర్తుతెలియని వ్యక్తులు ఈత వనానికి నిప్పుపెట్టడం తో మూడు వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగింది. పట్టణ శివారులో పదేండ్ల క్రితం హరితహారంలో భాగంగా వం ద ఎకరాల్లో ఈత వనాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం అవి పెద్దవి కావడంతో గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది గీత కార్మికులు కల్లు తీసి ఉపాధి పొందుతున్నారు. వాటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఈత వనంలో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దాదాపు మూడువేల పైచిలుకు ఈత చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈత చెట్లు కాలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.