సుల్తాన్‌బజార్, నవంబర్ 3: మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు. కోఠిలోని మహిళా వర్సిటీలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయిప్రియ, బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న నందిని, హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తనూష ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీరి స్వస్థలం తాండూరు. వీరితోపాటు అదే వర్సిటీలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న ముస్కాన్ చనిపోయింది. విద్యార్థుల మరణవార్త తెలియగానే వర్సిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీసీ ప్రొఫెసర్ సూర్యధనుంజయ్, ప్రిన్సిపాల్ లోకపావని, అధ్యాపకులు, విద్యార్థులు సంతాపం వ్యక్తంచేశారు.
తాండూరు నుంచి హైదరాబాద్‌లోని అత్తారింటికి వెళ్తున్న తపస్(27) మృతి చెందగా ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి. కోఠి ఈఎన్టీ దవాఖానలో కుమారుడికి చికిత్స చేయించేందుకు ఇంటి నుంచి బయల్దేరిన ఓ వ్యక్తి ముందుగా తాండూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ రైలు లేకపోవడంతో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు ప్రమాదానికి గురికావడంతో తండ్రి మరణించగా కు మారుడు తృటిలో ప్రా ణాపాయం నుంచి త ప్పించుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు అబ్దుల్లా, సుమయ్యా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అబ్దుల్లాను ఉస్మానియా దవాఖానాకు తరలించారు. మృతులకు శవపరీక్ష నిర్వహించేందుకు ఉస్మానియా ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ యాదయ్య ఆధ్వర్యంలోని బృందం వెళ్లింది.