హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హర్‌ప్రీత్ సింగ్, అర్వింద్ కుమార్‌లకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ముగ్గురూ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారులే కావడం విశేషం.