హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగుల సాధికారత అవార్డు-2024 కోసం ఈ నెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలని దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. వివరాలకు www. wdsc.telangana. gov.in ను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ట్రాన్స్జెండర్ల ఆరోగ్య రక్షణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, వయోవృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్జెండర్స్ సాధికారత శాఖల కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల ఆరో గ్యం, హక్కుల పరిరక్షణపై గురువారం సమీక్షించారు. ఏడీ శైలజ, ఆమెరికాలోని జాన్హప్కిన్స్ వర్సిటీ, యూఎస్ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, తెలంగా ణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఎక్సెల్ రేట్ ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు.