హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ కమిషన్కు రూ.3.56కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్ నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.14.25కోట్ల ను కేటాయించింది. దీనిలో భాగంగా 3.56కోట్లను విడుదల చేసింది.
ఎనర్జీ డిపార్ట్మెంట్ ‘సీవీవో’గా ప్రియదర్శిని ; ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఎనర్జీ డిపార్ట్మెంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా (సీవీవో)ఆశాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్ ప్రియదర్శిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు సీవీవోగా ఎం శారదాబాయి వ్యవహరించగా, ఆమె బదిలీ అయ్యారు. దీంతో తాజాగా ఎస్ ప్రియదర్శినిని ప్రభుత్వం నియమించింది. డిస్కంలకు 1,900కోట్లు రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలకు ప్రభుత్వం రూ.1,900కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది. గృహజ్యోతి సబ్సిడీ కింద ఆయా మొత్తాన్ని విడుదల చేసింది.