Womens Day | హైదరాబాద్ : విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి( Bharati Hollikeri ) సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సంవత్సరానికి గానూ మొత్తం 27 మందికి అవార్డుతోపాటు ప్రతి ఒక్కరికి రూ.లక్ష చొప్పున నగదుపురస్కారాన్ని అందజేయనున్నారు.