ముంబయి, మార్చి29: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభంతో పలు నగరాల్లో సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ముంబై నగరంలో కాండీవాలీలో సిలిండర్లను సరఫరా చేస్తున్న వాహనం పార్కింగ్ చేయగా, దాంట్లోని 27 ఎల్పీజీ సిలిండర్లు చోరీ అయ్యాయి. ఇందులో ఐదు సిలిండర్లు ఇంధనంతో నిండుగా ఉన్నాయని అధికారులు చెప్పారు. డెలివరీ చేస్తున్న వ్యక్తి నందకుమార్ చేసిన ఫిర్యాదు ప్రకారం, మార్చి 25న తన ఇంటికి సమీపంలో వాహనాన్ని పార్క్ చేయగా, మరుసటి రోజు వెళ్లి చూస్తే.. దాంట్లోని 27 సిలిండర్లు చోరీ అయినట్టు గుర్తించినట్టు చెప్పాడు.