
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం రూ.250 కోట్లు విడుదలచేసింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.