రుద్రూర్, మార్చి 19: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంప్‌లో గల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గుర య్యారు. వర్నిలోని బాలికల ఉన్నత పాఠశా లకు చెందిన విద్యార్థినులు బుధవారం ఉద యం హాస్టల్లో పప్పు అన్నం తిని స్కూల్‌కు వెళ్లారు. 11 గంటల సమయంలో అస్వస్థతకు గురైన 23 మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
వారిని హుటా హుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థినులను హాస్టల్‌కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని డాక్టర్ స్నేహ తెలిపారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌కు వచ్చి విద్యార్థులను పరామర్శించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని వార్డెన్ శిరీషకు సూచించారు.