నాగర్కర్నూల్టౌన్, నవంబర్ 19 : ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో 23 మంది చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో తరలిస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. ఒకే ఆటోలో 23 మంది చిన్నారులను ఎక్కించుకొని ప్రమాదకర పరిస్థితిలో స్కూల్ నుంచి తీసుకువెళ్తున్న ఆటోను ట్రాఫిక్ ఎస్సై కళ్యాణ్ పట్టుకొని సీజ్ చేశారు.
అనంతరం చిన్నారులను మరో రెండు వాహనాల్లో వారి ఇండ్లకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.