ఖైరతాబాద్, జూన్ 19 : బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 22న పీవోడబ్ల్యూ అ ర్ధశతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకురాలు సంధ్య తెలిపా రు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవా రం వేడుకలకు సంబంధించిన పోస్టర్లను పీవోడబ్ల్యూ నాయకులు ఝాన్సీ, విమలక్క, సామాజిక కార్యకర్త సజయతో కలిసి ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.