అటవీ అధికారులకు ముగిసిన శిక్షణ
తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో 21వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారులు, 33వ బ్యాచ్ బీట్ అధికారులకు 6 నెలల శిక్షణ ముగిసింది. 15 మంది సెక్షన్, 70 మంది బీటు అధికారులు శిక్షణ పొందారు. వీరిలో 24 మంది మహిళా అధికారులున్నారు.
ముంబై, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో 21వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారులు, 33వ బ్యాచ్ బీట్ అధికారులకు 6 నెలల శిక్షణ ముగిసింది. 15 మంది సెక్షన్, 70 మంది బీటు అధికారులు శిక్షణ పొందారు. వీరిలో 24 మంది మహిళా అధికారులున్నారు. వీరంతా శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన స్నాతకోత్సవంలో వారికి ధ్రువీకరణపత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి బంగారు పతకాలను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. సెక్షన్ అధికారుల్లో జీ కృష్ణగీత్ 4 బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.
డీ రేగ్యా, జీ ప్రవీణ్‌కుమార్ 3, కే రాధిక 2, టీ శ్రీనివాసరావు, ఆర్ మంజుల, యూ చంటి ఒక్కో బంగారు పతకాన్ని సాధించారు. బీట్ అధికారుల్లో టీ హరితకు 2, వీ రంజిత్ కుమార్‌కు 2, పీ శ్రీలతకు 2, ఎం హరినాయక్, ఎస్ వినయ్, టీ వెంకటేశ్, ఎన్ మహేశ్‌గౌడ్, కే సాయిదీప్తి, ఎం స్రవంతి, బీ నగేశ్, కే అమ్రియ నాయక్‌కు ఒక్కో బంగారు పతకం లభించాయి. రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి, అటవీదళాల అధిపతి ఆర్ఎం డోబ్రియాల్ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధాన అటవీ సంరక్షణాధికారి (హరితహారం) సీ సువర్ణ, ముఖ్య సంరక్షణాధికారి రామలింగం, కోర్సు డైరెక్టర్లు వీ రామమోహన్, రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

