హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ)/చర్లపల్లి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన కింద రాష్ట్రప్రభుత్వం ముందస్తుగా బుధవారం విడుదల చేసింది. వీరికి చర్లపల్లి సెంట్రల్ జైలు ప్రాంగణంలో కౌన్సెలింగ్, జాబ్మేళా నిర్వహించారు. వివిధ జైళ్ల నుంచి బృందాలుగా ఖైదీలను అక్కడికి తీసుకురాగా, తమ కుటుంబసభ్యులు, బంధువులను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సం దర్భంగా జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా మాట్లాడుతూ జైళ్లశాఖ చరిత్రలో ఇది మైలురాయి అని అభివర్ణించారు. కాగా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా 23మంది ఎంఏ, 35 మంది ఎమ్మెస్సీ పాసయ్యారు.