హైదరాబాద్, ఫిబ్రవరి9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నాయీ బ్రాహ్మణ కోఆపరేటీవ్ సొసైటీ, రజక కోఆపరేటీవ్ సొసైటీ ఫెడరేషన్లకు కలిపి రూ.21లక్షల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాయీ బ్రాహ్మణ సొసైటీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలకు రూ.7 లక్షలు, రజక సొసైటీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలకు రూ.14 లక్షలను ప్రభుత్వం గత బడ్జెట్లో పొందుపరిచిన విషయం తెలిసిందే.