హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 207 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. 196 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,887 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76, రంగారెడ్డి 24, హనుమకొండ 15, నల్లగొండలో 11 కేసులు వెలుగు చూశాయి.