హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెం ట్ (సీఐడీ)కి చెందిన కోర్టు మానిటరింగ్ సిస్టం (సీఎంఎస్) విభాగం 10 నెలల్లో 206 నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసుల ను క్లియర్ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ విషయాలు బుధవారం తెలిపారు.
సీఐడీ ఏడీజీగా ప ని చేసిన మహేశ్ భగవత్ బెయిలబుల్ వారెంట్ల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఎస్పీ రాంరెడ్డితో ‘స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం’ను ఏర్పాటు చేశారు. దాదాపు 36 ఏండ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించారు. సీఎంఎస్ వి భాగం 206 కేసులను ఈ ఏడాది డీల్ చేయగా, 30 కేసుల్లో నిందితులను కోర్టు లో హాజరుపర్చింది. మరో 20 మంది తామంతటతామే కోర్టులో లొంగిపోయా రు. మిగతా 156 కేసుల్లో నిందితులు చనిపోవడం, పూర్తిగా అడ్రస్ మార్చుకోవడం వంటి కారణాలతో వాటిని క్లోజ్ చేసినట్టు తెలిసింది. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.