సుల్తాన్‌బజార్ ; ఉద్యమంలో పుట్టి నిజాలను నిర్భయంగా వెలికితీసి యావత్ తెలంగాణ ప్రజల మనసులలో నమస్తే తెలంగాణ దినపత్రిక నిలిచిందని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సే నీ అన్నారు. మం గళవారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు ఎస్ విక్రమ్‌కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్‌తో కలిసి నమస్తే తెలంగాణ 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.